కరాటే మానవ శరీరంలో అంతర్గత బలాన్ని నిర్మిస్తది: పాల్వాయి

by Sridhar Babu |   ( Updated:2021-11-28 03:39:04.0  )
karate1
X

దిశ, మహబూబాబాద్ టౌన్: కరాటే మానవ శరీరంలో అంతర్గత బలాన్ని నిర్మిస్తుందని మున్సిపల్ చైర్మెన్ డా. పాల్వాయి రాంమోహన్ రెడ్డి అన్నారు. ఆదివారం మహబూబాబాద్ పట్టణంలోని ఓసీ క్లబ్ లో మానుకోట కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చదువులోనే కాకుండా క్రీడల్లో రాణించాలని, కరాటేలో మరిన్ని పథకాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కరాటేతో వ్యక్తిత్వ వికాసం బలపడుతుందని, తద్వారా అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చన్నారు. అత్యవసర సమయంలో, ఇతరులను కాపాడటానికి, ఎవరైనా దాడి చేసినప్పుడు కరాటే సహాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఊరుకొండ చంద్రశేఖర్, వరంగల్ సీనియర్ మాస్టర్ రవి, మానుకోట కరాటే అకాడమీ ప్రెసిడెంట్, కరాటే మాస్టర్ వీరు నాయక్, శరత్, శానిటరీ ఇన్ స్పెక్టర్ శ్రీహరి, ఈఈ క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story