మనీష్ విష్‌తో కరణ్ ఎమోషనల్

by Jakkula Samataha |   ( Updated:2023-03-24 18:07:54.0  )
మనీష్ విష్‌తో కరణ్ ఎమోషనల్
X

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్, నటుడు అయిన కరణ్ జోహార్.. మంగళవారం 48వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బంధువులు, స్నేహితుల శుభాకాంక్షలతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని కరణ్ చెప్పాడు. ‘ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా అందించిన విష్.. నా మనసును తాకింది అంటూ కృతజ్ఞతలు తెలిపాడు. ఫ్రెండ్స్, రిలేషన్స్ విషెస్‌తో కూడిన గంట ఐదు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియో తయారు చేసేందుకు ఎంత కష్టపడి ఉంటాడో అర్థమవుతోందని అన్నాడు. ఇలాంటి గొప్ప మిత్రులను కలిగి ఉండటం అదృష్టంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను’ చెప్పిన కరణ్.. ఈ వీడియోను జీవితంలోనే బెస్ట్ బర్త్ డే గిఫ్ట్‌గా అభివర్ణించారు.

‘మనీష్ మల్హోత్రా ఈ వీడియో ద్వారా బర్త్‌డే సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు వారం రోజులుగా అందరినీ ఫాలో అప్ చేస్తున్నట్లు తెలిసిందని.. ఈ వీడియో చూశాక చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పాడు. ఇది నా పుట్టిన రోజును.. కాదు కాదు ఈ ఏడాదిని చాలా స్పెషల్ చేసింది’ చెప్పాడు. ఇక వీడియోను ఎడిట్ చేసిన పునీత్ మల్హోత్రాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కరణ్.. మనీష్ ఈ విషయంలో మిమ్మల్ని ఎంత ఒత్తిడికి గురిచేసి ఉంటాడో అర్థం చేసుకోగలనన్నాడు. ఈ వీడియో, విషెస్.. మీ ఇద్దరి ప్రేమ నా మనసులో ఎప్పటికీ ఇలాగే ఉంటుందన్నారు.

పుట్టినరోజు సందర్భంగా ఇంట్లో పిల్లలతో కేక్ కట్ చేసిన కరణ్.. తల్లి, పిల్లలు తన బర్త్‌డే‌ను ఘనంగా జరిపేందుకు ఎంత ఎగ్జైట్ అయ్యారో తెలుపుతూ ఓ వీడియో కూడా పోస్ట్ చేశాడు. కాగా తనకు కేక్ తినిపిస్తే లావు అయిపోతావు అంటూ పిల్లలే కేక్ తినేశారంటూ కరణ్ కాస్త ఫీల్ అయ్యాడు.

Advertisement

Next Story

Most Viewed