- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిషి కపూర్… రొమాన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా
రిషి కపూర్ … రొమాన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. సినీ రంగంలో కొత్త ఒరవడికి నాంది. భారత సినీ చరిత్రలో కొత్త శకానికి పునాది. కానీ ఆ శకం ముగిసిపోయింది. అందరికీ సెలవిస్తూ… కానరాని లోకాలకు చేరింది. శోక సంద్రంలో ముంచేసి… హృదయాలను భారంగా మార్చేసి .. తను మాత్రం ప్రశాంతంగా కన్ను మూశాడు.
ఈ సందర్భంగా చింటు కపూర్ కు నివాళులు అర్పిస్తూ… తన చిన్నతనంలో రిషి అంటే ఎంత పిచ్చి ఉండేదో గుర్తుచేసుకున్నారు కరణ్ జోహార్. ఏడేళ్ల వయసులో రిషి కపూర్ నటించిన “దునియా మేరీ జేబ్ మే” సినిమా ప్రివ్యూ చూసేందుకు నా తల్లిదండ్రులకు ఆహ్వానం అందింది. అందుకోసం అందరూ రెడీ అయ్యారు. నా హీరోని తెరపై చూసేందుకు నేను కూడా వస్తాను అని అడగగా .. పొద్దున్నే స్కూల్ ఉందని అమ్మ వద్దని చెప్పింది. నేను భరించలేక పోయాను. అయినా కూడా నేను వినకుండా మారం చేయడంతో అమ్మ ఒప్పుకుంది. అంతే నా కళ్లలో స్టార్స్ వెలిగాయి. సెల్యులాయిడ్ మీద నా హీరోను చూసుకున్నా. అందమైన, మనోహరమైన, రొమాంటిక్ హీరో రిషి కపూర్ ను చూడడం, ఆయన పాటలు పాడడంతోనే నా బాల్యం గడిచిపోయేది. నా హీరో ఫోటో ప్రింట్ ఉన్న స్వెట్టర్ ధరించి బెడ్ రూం లో డ్యాన్స్ చేయడం… స్కూల్ ఫ్రెండ్స్ ముందు డిన్నర్ ప్లేట్ తో డాఫ్లివలే చేయడం… అన్ని గుర్తుకు వస్తున్నాయి. తొలిసారి కొచ్చిన్ లో నా తండ్రి నిర్మాణ సంస్థలో వచ్చిన దునియా చిత్రం సెట్స్ లో రిషి కపూర్ ను చూశాక.. దాదాపు మూర్చపోయాను. అతను ఒక స్మారక చిహ్నంగా కనిపించాడు.
నా చిన్ననాటి నా కల నెరవేరిన రోజు అది. సోటీ సినిమా దర్శకత్వం వహించినప్పుడు… రిషి కపూర్ మీద ఫస్ట్ సీన్ షూటింగ్ పూర్తి కాగానే ఆనందంతో నా కళ్ల నుంచి నీరు వచ్చింది. నా హీరోను నా సినిమాలో చూడడం కన్నీరు తెప్పించింది. కానీ ఈరోజు భరించలేని శూన్యం నా చుట్టుముట్టింది. నా జీవితంలో కొంత భాగం కొల్లగొట్టబడింది అనే బాధ వెంటాడుతుంది. రిషి కపూర్ ను ప్రేమించడాన్ని గౌరవంగా భావించే నేను… నా జీవితం మొత్తం గౌరవిస్తూనే ఉంటా. రొమాన్స్ ఆఫ్ ఇండియన్ సినిమా మనని వదిలివెళ్తుందా? అది జరగదు. లవ్ యూ రిషి కపూర్…
Tags: Rishi Kapoor, Karan Johar, Bollywood, Era, Dead, Romance of Indian cinema