పేద క్రికెటర్లకు కపిల్, గవాస్కర్ సాయం !

by Shyam |
పేద క్రికెటర్లకు కపిల్, గవాస్కర్ సాయం !
X

దిశ, స్పోర్ట్స్ : కరోనా లాక్‌డౌన్ కారణంగా పేదలు, కూలీలు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. వీరిని ఆదుకునేందుకు ప్రభుత్వాలు, స్వచ్ఛంద సేవా సంస్థలు కృషి చేస్తున్నాయి. క్రీడారంగం కూడా స్తంభించిపోవడంతో క్రికెట్ బోర్డులకు, క్రీడాకారులకు, ఇతర సిబ్బందికి కూడా ఆదాయం రాకుండా పోయింది. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాగా, వీరికి సాయమందించేందుకు ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) ముందుకొచ్చింది. ఇప్పటికే ఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా రూ. 10 లక్షలతో ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసి, విరాళాలు అందించాల్సిందిగా పలువురు క్రికెటర్లు, కార్పొరేట్ సంస్థలను కోరారు. దీనికి మాజీ క్రికెటర్లు సునిల్ గవాస్కర్, కపిల్ దేవ్ స్పందించారు. ఐసీఏ చేస్తున్న సేవలో తామూ భాగస్వాములవుతామని, సహాయ నిధికి తమ వంతు సాయం అందిస్తామని ప్రకటించారు.

ఐసీఏ ఇప్పటి వరకు రూ.39 లక్షల విరాళాలను సేకరించగా.. వీటిద్వారా దేశవ్యాప్తంగా బీసీసీఐ, రాష్ట్రాల క్రికెట్ అసోసియేషన్ల నుంచి పింఛన్ రాని, ఉద్యోగం లేని 30 మంది పేద క్రికెటర్లకు సాయం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతీ జోన్ నుంచి ఐదుగురు పేద క్రికెటర్లను ఎంపిక చేసి సాయం చేస్తామని అశోక్ మల్హోత్రా వెల్లడించారు. ఇప్పటికే గౌతమ్ గంభీర్, గుండప్ప విశ్వనాథ్ వంటి క్రికెటర్లు తమతో చేతులు కలపగా.. అజారుద్దీన్ సైతం సాయం చేస్తానన్నట్టు ఐసీఏ అధ్యక్షుడు తెలిపారు.

Tags : Indian Cricketers Association, Ashok Malhotra, Sunil Gavaskar, Kapil Dev, Coronavirus

Advertisement

Next Story

Most Viewed