పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌.. ట్రైన్‌లో 2,348 ప్యాసింజర్స్

by Anukaran |   ( Updated:2021-11-12 04:32:03.0  )
పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్‌.. ట్రైన్‌లో 2,348 ప్యాసింజర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కన్నూర్- బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున 3.50 నిమిషాలకు కొండచరియలు విరిగిపడి ఏకంగా ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ఘటన ధర్మపురం జిల్లా తొప్పూర్-శివడి స్టేషన్ల మధ్య జరిగింది. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 2,348 మంది ప్రయాణికులు ఉండగా.. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. ఏ ఒక్క ప్రయాణికుడు మరణించలేదని.. గాయాలు కూడా కాలేదని రైల్వే అధికారులు ప్రకటించారు.

ఎలా జరిగిందంటే..!

కర్ణాటకలోని బెంగళూరు-కేరళలోని కన్నూరు మధ్య ఈ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు సేవలు అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కన్నూరు స్టేషన్‌ నుంచి గురువారం ఉదయం 6 గంటలకు బయల్దేరిన రైలు.. శుక్రవారం 7.40 నిమిషాలకు బెంగళూరుకు చేరాల్సి ఉంది. కానీ, మార్గమధ్యలో ధర్మపురి జిల్లా తొప్పూర్‌ స్టేషన్‌ వరకు సాఫీగా సాగిన రైలు.. ఆ తర్వాత పట్టాలు తప్పింది.

తొప్పూర్ నుంచి శివడి స్టేషన్‌కు వస్తుండగా ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద పెద్ద బండరాళ్లు రైలు చక్రాల కిందకు అడ్డుగా వచ్చేశాయి. దీంతో ఐదు బోగీలు పట్టాలు తప్పడంతో ట్రైన్‌ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. కాగా, తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కొండచరియలు విరిగిపడ్డాయని అధికారులు చెప్పారు. మధ్యాహ్నం వరకు రూట్ క్లియర్ చేస్తామన్నారు.

రైలు పట్టాలపై యువకుడి డెడ్‌బాడీ.. చనిపోయాడా? చంపేశారా?

Advertisement

Next Story

Most Viewed