షాక్‌లో ఇండస్ట్రీ.. హీరోయిన్ ఆత్మహత్యాయత్నం

by Shyam |
Chaitra Kotoor
X

దిశ, సినిమా: కన్నడ హీరోయిన్, బిగ్ బాస్ సీజన్-7 కంటెస్టెంట్ చైత్రా కుటూర్‌ ఆత్మహత్యాయత్నం చేసింది. కోలార్‌‌లోని తన ఇంట్లో పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. వైవాహిక జీవితంలో నెలకొన్న సమస్యలే తన సూసైడ్‌కు కారణమయ్యాయని తెలుస్తోంది. కాగా చైత్ర.. ఇటీవలే మాండ్యకు చెందిన వ్యాపారవేత్త నాగార్జునను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆమెను ఇష్టపడి పెళ్లాడలేదని, బలవంతంగా పెళ్లి చేశారని నాగార్జున ఆరోపిస్తుండగా, అత్తింటివారు కూడా చైత్రను కోడలిగా అంగీకరించేందుకు నిరాకరించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురై చైత్ర ఆత్మహత్యకు ప్రయత్నించిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ప్రస్తుతం చైత్రకుటూర్‌ హెల్త్ నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Advertisement

Next Story