బీజేపీ, జనసేన కలిసి పోటీ : కన్నా

by srinivas |   ( Updated:2020-02-09 06:15:21.0  )
బీజేపీ, జనసేన కలిసి పోటీ : కన్నా
X

సీఏఏపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. ముస్లీంలను, దళితులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఏ భారతీయుడి పౌరసత్వం సీఏఏ తీసేయదని స్పష్టం చేశారు. ఈ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, దానిపై అపోహలను తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. బీజేపీ, జనసేన కలిసి స్థానిక ఎన్నికల్లో పనిచేస్తాయన్నారు. విశాఖకు సచివాలయం వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందదని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానులు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

Advertisement

Next Story