ప్రపంచం నవ్వుతోంది.. ఏం సమాధానం చెప్తారు?: కంగన

by Shyam |
ప్రపంచం నవ్వుతోంది.. ఏం సమాధానం చెప్తారు?: కంగన
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలో రైతుల ఆందోళన తీరును తప్పుపట్టింది కంగనా రనౌత్. గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోట బురుజులపై జాతీయ జెండాను తొలగించి కుంకుమ రంగు జెండాను ఎగరేయడంపై మండిపడింది. ఆందోళన చేసేది రైతులు కాదు టెర్రరిస్టులు అని తాను ముందే చెప్పానని..కానీ, దిల్జిత్ సింగ్, ప్రియాంక చోప్రా లాంటి సెలెబ్రిటీలు తనకు వ్యతిరేకంగా మాట్లాడారంది. మరి ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తారని వారిని ప్రశ్నించింది. ప్రపంచం మొత్తం మనల్ని చూసి నవ్వుతోందని.. మీకు కావాల్సింది ఇదే కదా అని ఫైర్ అయింది.

https://twitter.com/KanganaTeam/status/1354002309974532096?s=20

ఈ ఘటన ప్రతి భారతీయుడినీ ఇబ్బంది పెడుతుందని..మనందరినీ బానిసలుగా కనబడేలా చేస్తోందని అభిప్రాయపడింది కంగన. విదేశీ పెట్టుబడిదారులు, ఆర్థిక వ్యవస్థ, పరువు అన్నీ కొట్టుకుపోతున్నాయని.. మేము ఒకడుగు ముందుకేస్తే వారు మమ్మల్ని 100 అడుగులు కిందకు లాగుతున్నారని..వారే మళ్లీ గెలిచారని విచారం వ్యక్తం చేసింది. ఫార్మర్ టెర్రరిస్ట్‌లనే పదం వాడినందుకు ఆరు బ్రాండ్లు తనతో ఒప్పందాన్ని క్యాన్సల్ చేసుకున్నాయని కంగన తెలిపింది. రిపబ్లిక్ డే రోజు జరిగిన అల్లర్లకు సపోర్ట్ చేస్తున్న ప్రతి భారతీయుడూ టెర్రిరిస్టే అని పోస్ట్ పెట్టింది.

Tags:
slug :

Advertisement

Next Story