నన్ను చంపేందుకు ప్రయత్నించేది వాళ్లే :కంగన

by Shyam |
నన్ను చంపేందుకు ప్రయత్నించేది వాళ్లే :కంగన
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి జియా ఖాన్ ఆత్మహత్య చేసుకోలేదని తనను హత్య చేశారని ఆరోపణలు వచ్చాయి. అలాగే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులోనూ జరిగింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకోలేదని..అది పక్కా మర్డర్ అని అభిమానులు ఆందోళనలు చేశారు. నెపోటిజం వల్లే చనిపోయాడని మరికొందరు ఆరోపించారు. ముఖ్యంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఈ విషయంపై మీడియాలో చాలా సార్లు చర్చించింది. బాలీవుడ్ వారసత్వం వల్లే ఔట్‌సైడ్ నుంచి వచ్చిన వారికి పని దొరకట్లేదని..ఒక వేళ దొరికినా వారికి వచ్చే ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని..వాటి గురించి ప్రశ్నిస్తే చంపేస్తున్నారు అని ఆరోపించింది.

జియా ఖాన్ ది హత్యేనని..ఆ కేసులో జైలుకు వెళ్లిన సాజిద్ ఖాన్ ఇంకా బయటే తిరుగుతున్నాడని ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, దీనిపై కంగన స్పందించింది. బాలీవుడ్ మాఫియా రోజురోజుకూ రెచ్చిపోతున్నదని, మరింత బలంగా తయారవుతున్నదని ఫైర్ అయింది. వాళ్లు జియాను చంపేశారు.. సుశాంత్‌ను మర్డర్ చేశారు..ఇప్పుడు తనను కూడా అంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంది. ప్రపంచం ఆదర్శంగా లేదని..మీరు ఇతరులకు ఆహారంగా మారవచ్చని హెచ్చరించింది. మిమ్మల్ని మీరే రక్షించుకోవాలి ఎవరూ మిమ్మల్ని సేవ్ చేయరూ అని సూచించింది.

Advertisement

Next Story