- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
జో బైడెన్ ఓ గజినీ.. అంతా కమలా హారిస్ షో : కంగన
దిశ, వెబ్‌డెస్క్ :
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికవడంతో ఓ వైపు సామాన్యుల నుంచి సెలెబ్రిటీల వరకు ఆయనకు అభినందనలు తెలుపుతుంటే.. కొందరు మాత్రం బైడెన్ పనితీరు చూడకముందే విమర్శలు చేస్తుండటం గమనార్హం. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ తన నోటికి పని చెప్పింది. జో బైడెన్‌పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ విమర్శలు గుప్పించిన కంగన.. వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన కమలా హారిస్ అగ్రరాజ్యాన్ని ఏలేస్తుందని పొగడ్తలతో ముంచెత్తింది.
కాగా అత్యధిక వయసులో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన అభ్యర్థి జో బైడెన్ మాత్రమే. ప్రస్తుతం అమెరికాకు 46వ అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్ వయసు 77 సంవత్సరాలు. ఈ నేపథ్యంలోనే కంగనా రనౌత్ తనను గజినీగా అభివర్ణించింది. ‘ప్రతి అయిదు నిమిషాలకోసారి బైడెన్ డేటా క్రాష్ అవుతుంది. ప్రతిరోజూ ఆయన శరీరంలోకి ఇంజెక్ట్ చేస్తున్న మందుల వల్ల.. తను సంవత్సరానికి మించి పదవిలో ఉండే అవకాశం లేదు. కమలా హారిస్ మొత్తం షో రన్ చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. ఓ మహిళ అత్యున్నత స్థానానికి చేరుకుందంటే.. ప్రతి ఒక్క మహిళకు ఆమె మార్గదర్శనం చేసినట్టే అవుతుంది. చీర్స్ టు హిస్టారిక్ డే’ అని కంగన ట్వీట్ చేసింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జో, హారిస్ అమెరికా ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని క్లిప్పింగ్‌ను కూడా తన ట్వీట్‌కు జతచేసింది కంగన.
https://twitter.com/KanganaTeam/status/1325288675056312325