కంగనా, రంగోలి లకు మూడోసారి సమన్లు

by Shamantha N |
కంగనా, రంగోలి లకు మూడోసారి సమన్లు
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ తార కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చదేల్‌లకు ముంబయి పోలీసులు తాజాగా మూడోసారి సమన్లు జారీ చేశారు. కంగనా రనౌత్ ఈ నెల 23న, రంగోలి 24న బాంద్రా పోలీసు స్టేషన్‌లో హాజరవ్వాలని ఆదేశించారు. రెండు వర్గాల మధ్య వైరానికి ప్రేరేపించేలా సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టులకు సంబంధించి ఈ సమన్లు జారీ అయ్యాయి.

హిమాచల్ ప్రదేశ్‌లో తమ సోదరుడి పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారని, అందుకే పోలీసుల ముందు హాజరుకాలేమని తొలిసారి జారీ చేసిన సమన్లకు వీరిరువురు సమాధానమిచ్చారు. నవంబర్ 10న పోలీసుల ముందు హాజరవ్వాలని ఈ నెల 3న రెండోసారి తాకీదులు పంపారు. వీటికి సమాధానం రాకపోవడంతో తాజాగా మరోసారి సమన్లు పంపారు.

Advertisement

Next Story