కొహ్లీ, డివిలియర్స్ అత్యుత్తమ ఆటగాళ్లు

by Shyam |
కొహ్లీ, డివిలియర్స్ అత్యుత్తమ ఆటగాళ్లు
X

దిశ, స్పోర్ట్స్: న్యూజీలాండ్ కెప్టెన్ కేల్ విలియంసన్‌‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. క్రికెట్ ప్రపంచంలో కూల్ కెప్టెన్ అని పేరు తెచ్చుకున్నది విలియమ్‌సన్ మాత్రమే. తన మనసులో ఏదీ దాచుకోడు. తన ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను సైతం అతడు పొగడ్తలతో ముంచేస్తుంటాడు. ఇటీవల కివీస్, ఇండియా సిరీస్ జరిగినప్పుడు బౌండరీ లైన్ వద్ద టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీతో కలసి ముచ్చట్లు పెట్టడం టీవీల్లో అందరూ చూశారు.

విలియమ్‌సన్, కొహ్లీల మధ్య మంచి వాతావరణం ఉంటుంది. ప్రస్తుతం కరోనా కారణంగా అందరూ ఇండ్లకే పరిమితమయ్యారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఆస్ట్రేలియన్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలసి కేన్ విలియమ్‌సన్ లైవ్ చాట్ చేశాడు. ఈ సందర్భంగా ఎదురైన ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్‌లో విరాట్ కొహ్లీ, ఏబీ డివిలియర్స్ గొప్ప బ్యాట్స్‌మాన్లు అని చెప్పాడు. ‘కొహ్లీ అన్ని ఫార్మాట్లలో రాణిస్తుంటాడు. బౌలర్లపై ప్రతీ మ్యాచ్‌లో ఆధిపత్యం చూపించడం కొహ్లీకే చెల్లింది. అతడితో తలపడాలంటే చాలా ముచ్చటగా ఉంటుంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు ఆయన సొంతం. ఇక ఫ్రాంచైజీ క్రికెట్ మాత్రమే ఆడుతున్న ఏబీ డివిలియర్స్ ఒక ప్రత్యేకమైన ఆటగాడు. ఎంతోమంది క్వాలిటీ ప్లేయర్లు ఉన్నప్పటికీ కొహ్లీ-డివిలియర్స్‌లే బెస్ట్ బ్యాట్స్‌మెన్లు’ అని విలియమ్‌సన్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఐపీఎల్‌లో సన్ రైజర్ తరపున గొప్ప భాగస్వామ్యాలు నిర్మించి డేవిడ్ వార్నర్ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వార్నర్ సన్‌రైజర్స్ కెప్టెన్ కాగా, విలియమ్‌సన్ జట్టులో సభ్యుడే.

Tags : Kane Williamson, David Warner, Instagram, Live Chat, Virat Kohli, AB de Villiers, Cricket, IPL

Advertisement

Next Story