- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేన్ విలిమ్‌సన్‌కు ఇది కొత్త కాదు
దిశ, స్పోర్ట్స్: సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాఢు కేన్ విలియమ్‌సన్ గత రెండేళ్లలో ఐదు సార్లు సూపర్ ఓవర్‌లో ఓడిపోయాడు. న్యూజీలాండ్ కెప్టెన్‌గా రెండు మ్యాచ్‌లు, ఐపీఎల్‌లో 3 మ్యాచ్‌లలో కేన్ విలియమ్‌సన్ ఆడిన సూపర్ ఓవర్లు అతడి జట్టుకు వ్యతిరేకంగా వచ్చాయి. ఈ ఐదు సూపర్ ఓవర్లలో అన్నింటి కంటే ఎక్కువ నష్టం చేసింది 2019 వరల్డ్ కప్ ఫైనల్. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్‌లో మ్యాచ్ టై కావడంలో సూపర్ ఓవర్ ద్వారా ఫలితం తేల్చాలని నిర్ణయించారు. అయితే సూపర్ ఓవర్ కూడా టై కావడంతో అత్యధిక బౌండరీలు కొట్టిన ఇంగ్లాండ్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా ప్రకటించారు.
ఆ తర్వాత స్వదేశంలో ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ కెప్టెన్ సూపర్ ఓవర్‌లో ఓడిపోయాడు. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఆ మ్యాచ్‌లో కేన్ 94 పరుగులు కొట్టాడు. అయితే సూపర్ ఓవర్‌లో రోహిత్ శర్మ రెండు సిక్సులు కొట్టి ఇండియాను గెలిపించాడు. ఐపీఎల్ 2019 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. అప్పుడు కేన్ ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్‌గా ఉన్నాడు. గత సీజన్‌లో హైదరాబాద్ జట్టు కోల్‌కతాపై సూపర్ ఓవర్‌లో ఓడిపోయింది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో కూడా సూపర్ ఓవర్‌లో హైదరాబాద్ ఓడిపోయింది. ఈ 5 సార్లు కేన్ విలియమ్‌సన్ జట్టులో ఉన్నాడు. అందులో మూడు మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. తనకు సూపర్ ఓవర్లు కలసి రావడం లేదని మ్యాచ్ అనంతరం కేన్ వ్యాఖ్యానించడం గమనార్హం.