- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగ అనుకొని.. పూల వ్యాపారిపై కర్రలతో దాడి
దిశ, కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అజంపురా కాలనీలో కొందరు వ్యక్తులు హల్‌చల్ చేశారు. దొంగ అనుకొని పూల వ్యాపారిని చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కామారెడ్డి పట్టణంలోని అజంపురా కాలనీకి చెందిన షేక్ యూసుఫ్ అనే యువకుడు పట్టణంలోని ధర్మశాల వద్ద పూల వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. పండగల సీజన్ కావడంతో గురువారం రాత్రంతా పనిచేసి శుక్రవారం తెల్లవారుజామున హరిజనవాడ ప్రాంతంలో ఇంటివైపు యూసుఫ్ నడుచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ క్రమంలో రాత్రి ఒంటరిగా రోడ్డువెంట నడుచుకుంటూ వెళ్తోన్న యూసుఫ్‌ను దొంగ అనుకొని కాలనీకి చెందిన రంజిత్, రాజు, వసీంలతో పాటు మరికొంతమంది కలిసి దాడిచేశారు. పక్కనే ఉన్న చెట్టుకు కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా చితకబాదారు. దీంతో తీవ్రంగా గాయపడ్డ యూసుఫ్‌ను గమనించిన స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా మారడంతో హైదరాబాద్‌కు తరలించారు. బాధితుని అన్న ఫిర్యాదు మేరకు కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.