కమలాహారిస్‌కు తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం

by vinod kumar |   ( Updated:2021-06-07 00:40:25.0  )
కమలాహారిస్‌కు తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న యంత్రాంగం
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహారిస్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణీస్తున్న ఎయిర్‌ఫోర్స్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ క్రమంలో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వివరాల ప్రకారం.. అమెరికా ఉపాధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కమలాహారిస్ తొలిసారిగా విదేశీ పర్యటనలో భాగంగా గ్వాటిమాలకు బయలుదేరారు. పర్యటనలో భాగంగా టేకాఫ్ అయిన కాసేపటికే కమలాహారిస్‌ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతికలోపం తలెత్తింది. దీంతో విమానం అత్యవసరంగా ల్యాండైంది. ఈ క్రమంలో మరో విమానంలో కమలాహారిస్ గ్వాటిమాలకు వెళ్లారు.

Advertisement

Next Story