కమలా హ్యారిస్ కీలక నిర్ణయం 

by vinod kumar |   ( Updated:2020-08-17 05:14:22.0  )
కమలా హ్యారిస్ కీలక నిర్ణయం 
X

వాషింగ్టన్: డెమోక్రాట్ల తరఫున ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపికైన కమలా హ్యారిస్ తన ప్రెస్ సెక్రెటరీగా ఇండియన్ అమెరికన్ సబ్రీనా సింగ్‌ను నియమించుకుంది. డెమోక్రాట్ ఉపాధ్యక్ష అభ్యర్థి క్యాంపెయిన్‌లో కమలా హ్యారిస్‌కు సబ్రీనా సింగ్ ప్రెస్ సెక్రెటరీగా వ్యవహరించనున్నారు.

సబ్రీనా సింగ్ ఇదివరకు ఇద్దరు డెమోక్రాట్ అధ్యక్ష అభ్యర్థులకు ప్రతినిధిగా బాధ్యతలు నిర్వహించారు. బిడెన్, హ్యారిస్ బృందంలో చేరడానికి ఆతృతగా ఉన్నట్టు సబ్రీనా సింగ్ తెలిపారు. వెంటనే బాధ్యతలు తీసుకుని నవంబర్‌లో గెలుపొందాలని ఉబలాటపడుతున్నట్టు వివరించారు. గతవారం డెమోక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి జో బిడెన్ ఉపాధ్య అభ్యర్థిగా కమలా హ్యారిస్‌ను ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఆఫ్రికన్-అమెరికన్ అయిన కమలా హ్యారిస్‌కు యూఎస్‌లో నల్లజాతీయుల్లో బలమైన మద్దతు ఉన్నది.

Advertisement

Next Story