ప్రజలతో ఆటలా.. ఈ చెత్త హామీ ఏంటి?

by Shamantha N |
ప్రజలతో ఆటలా.. ఈ చెత్త హామీ ఏంటి?
X

దిశ, వెబ్‌డెస్క్: ఓటు వేసి గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్‌ ఉచితంగా ఇస్తామన్న వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. బిహార్ మేనిఫెస్టోలో తమ పార్టీని గెలిపిస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని చెప్పిన బీజేపీ పై ఇప్పటికే ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శలు చేస్తున్నాయి. తాజాగా తమ ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా ఇస్తామని తమిళనాడు అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించింది.

ఈ ప్రకటనతో తమిళవాసులు మండిపడుతున్నారు. తాజాగా ఇదే వ్యవహారం పై స్పందించిన కమల్‌హాసన్ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. ‘పేదల ఆకలి, వారి జీవితాలతో ఆడుకోవాలని చూస్తే.. మీ రాజకీయ భవిష్యత్తును ప్రజలే నిర్ణయిస్తారని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇంకా అందుబాటులోకి రాని వ్యాక్సిన్‌ను ముందే ఇస్తామనడం ఒక చెత్త హామీ అని ఆయన ఖండించారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం అన్ని రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించింది.

Advertisement

Next Story

Most Viewed