700మందికి నిత్యావసరాలు పంపిణీ

by vinod kumar |
700మందికి నిత్యావసరాలు పంపిణీ
X

దిశ, మేడ్చల్ : కరోనా నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్‌ను అమలు చేస్తోంది.దీంతో పేదలు, వలస కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఈ క్రమంలోనేజవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొండల్ రెడ్డి వెంచర్‌లో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీ సలహాదారులు కల్లేపల్లి సదానందం ఆధ్వర్యంలో సదానంద్ ఫౌండేషన్ ద్వారా 21వ డివిజన్ కార్పొరేటర్ చింతల ప్రమీల, యూత్ అధ్యక్షులు సునీల్ కుమార్ నేతృత్వంలో సుమారు 700 మందికి బియ్యం, కూరగాయలు తదితర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అయితే లాక్ డౌన్ నిబంధలను అతిక్రమించకుండా పలు కాలనీల్లో నివసించే పేదలను గుర్తించి వారికి ఒక రోజు ముందే టోకెన్లను అందజేశారు. కార్యక్రమంలో ఎస్ఐ అనిల్, జవహర్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ బండ కింది ప్రసాద్ హాజరయ్యారు.
Tags: carona, lockdown, 700members, rice, grams distribution, kallepalli foundation

Advertisement

Next Story

Most Viewed