ముగిసిన కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాంపియన్‌షిప్

by Sridhar Babu |
Cp1
X

దిశ, జనగామ: పోలీసుల ఆధ్వర్యంలో జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాకతీయ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఛాంపియన్‌షిప్ క్రీడలు గురువారం రాత్రి ముగిశాయి. ఈ సందర్భంగా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ముఖ్య అతిథులుగా హాజరై ముగింపు క్రీడోత్సవాలను ప్రారంభించారు. పోటీల్లో మహిళల ఫైనల్స్ లో జనగామ జిల్లా హైదరాబాద్ పై రెండు పాయింట్ల తేడాతో విజయం సాధించింది. పురుషుల విభాగంలో వరంగల్, నల్గొండ జిల్లాల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో నల్గొండ జిల్లా వరంగల్ జిల్లాపై విజయం సాధించి ఛాంపియన్‌షిప్ ను గెలుచుకుంది. ఈ మేరకు నిర్వహించిన బహమతి ప్రదానోత్సవంలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా గెలిచిన జట్లతోపాటు రన్నరప్ గా నిలిచిన జట్లకు ట్రోపీలతో పాటు, నగదు పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీసీపీ శ్రీనివాస రెడ్డి, ఏసీపీ కృష్ణ, వెస్ట్ జోన్ పోలీసులు పాల్గొన్నారు.

tarun-joshi-1

Advertisement

Next Story