Anandayya corona medicine: త్వరలో ఆనందయ్య మందు పంపిణీ’

by Anukaran |   ( Updated:2021-05-24 05:44:56.0  )
Ayurvedic doctor Anandayya
X

దిశ, వెబ్‌డెస్క్: త్వరలో కృష్ణపట్నంలో ఆనందయ్య మందు పంపిణీకి అనుమతి వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆనందయ్య భద్రతపై కూడా సమీక్ష చేస్తున్నామని.. ఇదే విషయంపై అడిషనల్ ఎస్పీని కూడా కోరామన్నారు. ఆయుర్వేద మందుపై ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తోందని.. దీనిపై అధ్యయనం కూడా మొదలుపెట్టిందని ఆయన గుర్తు చేశారు. లక్షల మందికి నాటు వైద్యం అనేది మామూలు విషయం కాదని.. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని నిర్ధారణకు వచ్చిన తర్వాతే దాని మీద నిర్ణయం తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉందని కాకాని చెప్పుకొచ్చారు. నాటు వైద్యంపై పాజిటివ్ నివేదిక వస్తే వెంటనే అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధంగా ఉందన్నారు.

Advertisement

Next Story