- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేపర్ వ్యూ బేసిస్‌లో సేతుపతి మూవీ..
దిశ, వెబ్‌డెస్క్:
విజయ్ సేతుపతి, ఐశ్వర్యా రాజేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కా పే రణసింగం’. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకోగా.. జీ ప్లెక్స్‌లో రిలీజ్ కానుంది. అక్టోబర్ 2న సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించింది మూవీ యూనిట్. రాజకీయాలు, సమాజ వ్యవస్థలో లోపాలను ఎత్తి చూపుతూ తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా థియేటర్‌లోనే విడుదల చేయాలని అనుకున్నా.. పరిస్థితులు సహరించకపోవడంతో ఓటీటీకే ఓటేశారు నిర్మాతలు. కేజీఆర్ స్టూడియోస్ నిర్మిస్తున్న సినిమా ద్వారా పి. విరుమండి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.
పేపర్ వ్యూ బేసిస్ మీద రిలీజ్ అవుతున్న సినిమా జీప్లెక్స్‌లో చూడాలంటే ప్రేక్షకులు రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. ఐదు ఇండియన్ లాంగ్వేజెస్‌లో అందుబాటులో ఉండబోతున్న సినిమాలో రంగరాజు పాండే, యోగి బాబు, వేల రామమూర్తి, సముద్రఖని, పో రామ్ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.