అలిగిన కేఏ పాల్.. ఆమరణ నిరాహార దీక్షకు కండీషన్లు

by Anukaran |   ( Updated:2021-03-21 06:25:32.0  )
k.a.paul
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఈ పాల్ అసహనం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అండగా ఉండేందుకు తాను అమెరికా నుంచి ఢిల్లీ వచ్చానని తెలిపారు. తాను కార్మిక సంఘాలకు అండగా ఉంటానంటే కాదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కలిశారని ధ్వజమెత్తారు. ఢిల్లీ వచ్చిన కార్మిక సంఘం నేతలు తనను కలవకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు అండగా ఉంటానని.. ఎలాంటి పోరాటానికైనా రెడీగా ఉన్నానని తెలిపారు.

స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘం నేతలు వచ్చి తనను కలిస్తేనే.. ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతానని తెలిపారు. ప్రైవేటీకరణ అంశంలో రాజకీయ నాయకులు అమ్ముడు పోయారని కేఏ పాల్ ధ్వజమెత్తారు. ఇకపోతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేస్తున్న ఆందోళనలకు కేఈ పాల్ మద్దతు ప్రకటించారు. కార్మికుల పక్షాన పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. ఆదివారం నుంచి కార్మికుల నిరసనలకు మద్దతుగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. దీంతో కార్మిక సంఘాల నేతలు కేఏపాల్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed