- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ రోజును మరిచిపోలేను : సింధియా
న్యూఢిల్లీ : కాంగ్రెస్‌లో అనేక మార్పులొచ్చాయనీ, ఒకప్పుడున్న కాంగ్రెస్ ఇప్పుడు లేదు అని జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. బీజేపీ కండువా కప్పుకున్నాక.. పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ప్రజా సేవ చేయాలనే లక్ష్యాన్ని నెరవేర్చేందుకు రాజకీయాలు ఒక వేదిక అని అన్నారు. కాంగ్రెస్ చెప్పేదానికి, చేసేదానికి పొంతన ఉండటం లేదని విమర్శించారు. పనిచేసిన వారికి ఆ పార్టీలో గుర్తింపు దొరకదని ఆరోపించారు. తన తండ్రి 75వ జయంతి (మార్చి 10) జీవితంలో మరిచిపోలేనని అన్నారు. అదే రోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోడీలతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ కావడం గమనార్హం. పార్టీలోకి ఆహ్వానించిన అమిత్ షా, మోడీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15నెలలు దాటింది కానీ, ఇచ్చిన హామీలు మాత్రం అలాగే ఉండిపోయాయని కమల్‌నాథ్ సర్కారును విమర్శించారు.
Tags: jyotiraditya scindia, bjp, join, jp nadda, HQ