ట్రెండింగ్‌లో జ్యోతక్క దసరా షాపింగ్

by Sujitha Rachapalli |
ట్రెండింగ్‌లో జ్యోతక్క దసరా షాపింగ్
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో అతి పెద్ద పండుగ ‘దసరా’. పల్లె నుంచి పట్నం దాకా అందరూ ధూమ్‌దామ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారన్న సంగతి తెలిసిందే. ఇక దసరా రోజు కొత్త బట్టలు కట్టుకోవడం మన సంప్రదాయం. అందుకే దసరా వస్తుందంటే.. ఇంటిల్లిపాది కలిసి షాపింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలోనే.. సెలెబ్రిటీలంతా షాపింగ్ బాటపట్టారు. బిగ్‌బాస్ ఫేమ్ జ్యోతక్క తన బిగ్‌బాస్ స్నేహితులతో కలిసి బాన్సువాడలో దసరా షాపింగ్ చేస్తుండగా, యాంకర్ రవి తన శ్రీమతితో కలిసి ఐకియాలో షాపింగ్ చేస్తున్నాడు.

దసరాకు నెల రోజుల ముందు నుంచే షాపింగ్ మాల్స్, ఫుట్‌వేర్ కంపెనీలు, ఫర్నిచర్, హోమ్ కుకింగ్, ఎలక్ట్రానిక్స్ షాపులన్నీ కూడా ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. బైక్, కార్ల షోరూమ్స్ కూడా తగ్గింపు ధరలతో తమ ప్రొడక్ట్‌లను అందిస్తాయి. ఈ కామర్స్ సైట్లు కూడా దసరా, దీపావళి పండుగ రోజుల్లో ప్రత్యేక సేల్స్ నిర్వహిస్తుంటాయి. ఈ క్రమంలోనే జ్యోతక్క తన స్నేహితులు అలీరెజా, హిమజ, రవికృష్ణ, రాహుల్ సిప్లిగంజ్‌తో పాటు.. బాన్సువాడలోని ఓ బట్టల షాపింగ్‌మాల్‌లో దసరా షాపింగ్ చేస్తోంది. తన స్నేహితులతో కలిసి షాపింగ్ చేస్తున్న వీడియోను జ్యోతక్క తన యూట్యూబ్ చానల్‌లో షేర్ చేసుకుంది. ఇక యాంకర్ రవి కూడా తన శ్రీమతితో కలిసి ఐకియా షోరూమ్‌లో దసరాకు కొత్త బట్టలతో పాటు ఇంట్లోకి కావాల్సిన కొత్త వస్తువులను కొనుగోలు చేస్తున్నాడు. రవి కూడా తన షాపింగ్‌కు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నాడు.

Advertisement

Next Story