‘రాధే శ్యామ్’కు బీట్స్ అందించేది తనే..

by Shyam |
‘రాధే శ్యామ్’కు బీట్స్ అందించేది తనే..
X

దిశ, వెబ్‌డెస్క్ : యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్, బ్యూటిఫుల్ పూజా హెగ్డే జంటగా నటిస్తున్న ‘రాధే శ్యామ్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్, టి సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ఈ మధ్య పూజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన ప్రేరణ లుక్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈ నెల 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అయింది మూవీ యూనిట్. బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ పేరుతో మోషన్ పోస్టర్ రిలీజ్ చేయబోతుంది.

బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్ సరే.. ఇంతకీ సినిమాకు బీట్స్ ఇచ్చేది ఎవరు? అనే ప్రశ్న చాలాసార్లే అడిగారు అభిమానులు. దీంతో లేటెస్ట్‌గా మ్యూజిక్ డైరెక్టర్ పేరు అఫిషియల్‌గా అనౌన్స్ చేశారు. తమిళ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ పేరు ప్రకటించింది మూవీ యూనిట్. పీరియాడికల్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో రిలీజ్ అవుతుండగా.. ప్రభాస్ ఫ్యాన్స్‌ను జస్టిన్ ప్రభాకరన్ శాటిస్‌స్తై చేయగలడా అనేదే ప్రశ్న.

Advertisement

Next Story