ఐపీఎల్ వల్లే ఆటగాళ్లకు గాయాలు : లాంగర్

by Shyam |
ఐపీఎల్ వల్లే ఆటగాళ్లకు గాయాలు : లాంగర్
X

దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా ఆటగాళ్లు గాయాలా బారిన పడ్డారు. మూడు టెస్టులు ఆడిన టీమ్ ఇండియా ప్రస్తుతం ఒక టెస్టు ఓడి, మరో టెస్టు గెలిచి.. సిడ్నీ టెస్టును డ్రా చేసుకున్నది. సిడ్నీ టెస్టులో టెస్టు డ్రా చేసుకున్నా.. ఏకంగా ఐదుగురు ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. దీంతో చివరిదైన గబ్బా టెస్టులో జట్టు కూర్పు సమస్యగా మారింది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ వల్లే టీమ్ ఇండియా ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారని చెప్పాడు.

‘ఐపీఎల్ వల్ల టీమ్ ఇండియాకు మేలే జరుగుతున్నది. అయితే గత ఏడాది సరైన సమయంలో ఐపీఎల్ నిర్వహించలేదు. ఆస్ట్రేలియా పర్యటన ముందే ఐపీఎల్ నిర్వహించారు. దీంతో కీలకమైన ఆటగాళ్లకు విశ్రాంతి లభించలేదు. అంతే కాకుండా కొంత మంది అప్పుడే గాయాల పాలయ్యారు’ అని లాంగర్ అన్నాడు. రాబోయే సీజన్‌లో ఈ విషయంపై టీమ్ ఇండియా యాజమాన్యం, బీసీసీఐ ఆలోచిస్తుందని భావిస్తున్నట్లు లాంగర్ అభిప్రాయపడ్డాడు. ఇక చివరి టెస్టుకు కీలకమైన జడేజా, బుమ్రా లేకపోవడం వాళ్లకు పెద్ద లోటే అని చెప్పాడు. అది మాకు కీలకాంశంగా మారబోతున్నదని లాంగర్ చెప్పాడు. అయితే ఆటగాళ్లు లేకపోయినా కొన్ని సార్లు జట్టుగా రాణించే అవకాశం ఉన్నదని లాంగర్ అన్నాడు.

Advertisement

Next Story

Most Viewed