జస్టిస్ ఫర్ అంజలి.. రాజీవ్ రహదారిపై రాస్తారోకో

by Sridhar Babu |   ( Updated:2021-11-10 03:03:43.0  )
జస్టిస్ ఫర్ అంజలి.. రాజీవ్ రహదారిపై రాస్తారోకో
X

దిశ, గోదావరిఖని : ప్రేమ పేరుతో ప్రియుడి చేతిలో దారుణ హత్యకు గురైన కేకే నగర్ అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం రాజీవ్ రహదారిపై కుటుంబ సభ్యులతో కలిసి యాదవ సంఘం రాస్తారోకో నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. సమాజంలో ఎక్కడో ఒక చోట మహిళలపై అత్యాచారాలు, హత్యలు వేధింపులు, జరుగుతూనే ఉన్నాయన్నారు.

మహిళలకు ప్రత్యేక చట్టం తీసుకువచ్చి, వారిపై అఘాయిత్యాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే అంజలిని దారుణంగా హత్య చేసిన చాట్ల రాజును బహిరంగంగా ఉరి తీయాలని, అంజలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

Advertisement

Next Story