- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూరాల గేట్లు ఎత్తివేత
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎగువ ప్రాజెక్టుల నుండి వరద ప్రవాహం కొనసాగుతుండడంతో జూరాల నుంచి భారీగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో గల ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద ఉధృత పెరిగింది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద ప్రవాహం పెరగడంతో ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులలో గేట్లు ఎత్తివేయడంతో భారీ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది.
సుమారు లక్షా 90 వేల క్యూసెక్కుల వరద నీటితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ జూరాల ప్రాజెక్టుకు చేరుకుంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టులో25 గేట్లను ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 1.62.916 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 1.90.844 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం: 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుత 7.933 టీఎంసీలు నిల్వ ఉంది. అలాగే పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 – మీటర్లకు, ప్రస్తుత నీటిమట్టం 317.650 మీటర్లు ఉన్నాయి.