నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం

by Anukaran |
నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు ఆకాశంలో అద్భుత దృశ్యం కనిపించనుంది. సోమవారం రాత్రి గురు, శని గ్రహాలు అత్యంత సమీపానికి రానున్నాయి. దీంతో గురు, శని గ్రహాలు ఒక్కటిగా కనిపించనున్నాయి. దాదాపు 400 ఏళ్ల తర్వాత ఆకాశంలో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది. రెండు గంటల పాటు రెండు గ్రహాలు కనివిందు చేయనున్నాయి.

భారత్‌లో సూర్యాస్తమయం తర్వాత ఈ మహా కలయికను చూడవచ్చు. సాయంత్రం 5.21 గంటల నుంచి రాత్రి 7.12 గంటల వరకు వీక్షించవచ్చు. టెలిస్కోప్, బైనాక్యులర్లతో అద్భత దృశ్యాన్ని వీక్షించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed