అరుదైన ఘనతను సాధించిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ!

by Harish |
jsw
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ ఉక్కు తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ అరుదైన ఘనతను సాధించింది. ప్రముఖ ఎస్అండ్‌పీ డొజోన్స్ సస్టైనబులిటీ ఇండెక్స్‌లో స్థానం దక్కించుకుంది. భారత్ నుంచి ఇప్పటికే ఈ సూచీలో 15 కంపెనీలు స్థానం దక్కించుకోగా, అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల నుంచి ఎంపికైన ఏకైక స్టీల్ తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ అవడం విశేషం.

ఎస్అండ్‌పీ డొజోన్స్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం 108 సంస్థలతో ఈ సూచీని విడుదల చేశారు. సామాజిక బాధ్యతతో పాటు పర్యావరణ, నిర్వహణ ప్రగతి లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఈ జాబితాను రూపొందిస్తారు. డొజోన్స్ సస్టైనబులిటీ ఇండెక్స్‌ సూచీ కార్పొరేట్ రంగంలో ఉన్న కంపెనీల బలమైన సుస్థిరతకు గుర్తుగా పరిగణిస్తారు. అంతర్జాతీయంగా పెట్టుబడిదారులు, ఫండ్ మేనేజర్లు ఇన్వెస్ట్ చేసేందుకు పరిశీలించే ముందు సామాజిక బాధ్యత, పర్యావరణ, నిర్వహణ ప్రగతి లాంటి అంశాలను చూసే ముందుకొస్తారు.

‘ఈ జాబితాలో చోటు సంపాదించడం సుస్థిరమైన పురోగతికి నిదర్శనం. తమ కంపెనీ పనితీరు విషయంలో మెరుగ్గా కొనసాగేందుకు టెక్నాలజీతో పాటు కార్యకలాపాల నిర్వహణలో మెరుగ్గా ఉందని’ జేఎస్‌డబ్ల్యూ స్టీల్ ఎండీ శేషగిరి రావు అన్నారు. కాగా ప్రస్తుతం జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీ ఏడాదికి 2.7 కోట్ల టన్నుల ఉక్కును ఉత్పత్తి చేస్తోంది.

Advertisement

Next Story