- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చిన జర్నలిస్టులు
దిశ, భూపాలపల్లి : జర్నలిస్డులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఇండియన్ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ) ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ (టీడబ్ల్యూజేయూ)ఆధ్వర్యంలో జర్నలిస్టులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ అధ్యక్షుడు సామంతుల శ్యామ్, జిల్లా ప్రధాన కార్యదర్శి క్యాతం సతీష్ కుమార్, రాష్ట్ర కమిటీ మెంబర్ సామిల శ్రీనివాస్, కమిటీ సభ్యులతో కలిసి జిల్లా కేంద్రంలోని శుభాష్ కాలనీలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి, నిరసన వ్యక్తం చేసారు.
జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల తీర్చడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున మీరైనా మా సమస్యలను పరిష్కరించాలని గాంధీకి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు రాచర్ల ప్రభాకర్, ఎలగొండ రాజేంద్ర ప్రసాద్, చింతల కుమార్ యాదవ్, సనిగర లక్ష్మన్, పుల్ల రవితేజ, గుర్రం చందు, మేర వెంకటస్వామి, సమ్మయ్య గౌడ్, క్యాతం వెంకటేశ్వర్లు, రంజీత్, వనపర్తి నరేందర్, కుసుమ చంద్రశేఖర్, బర్ర కిరణ్, బెజ్జంకి సాంబమూర్తి, తాచర్ల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.