ఘోర రోడ్డు ప్రమాదం.. జర్నలిస్ట్ మృతి

by Sumithra |
Accident-11
X

దిశ, బేగంపేట: వేగంగా వచ్చిన లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో జర్నలిస్ట్(సబ్ ఎడిటర్) మృతి చెందిన సంఘటన బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రజ్యోతి దినపత్రిక వెబ్ ఎడిషన్ లో సబ్ ఎడిటర్ గా విధులు నిర్వర్తిస్తున్న మధు సూదన్ ఆఫీస్ కు వెళ్లేందుకు శుక్రవారం ఉదయం ఇంటి నుంచి బయలుదేరాడు. బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కట్ట మైసమ్మ ఆలయం వద్దకు రాగానే వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. దీంతో మధు సూదన్ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Next Story