- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జర్నలిస్టులపై కరోనా పంజా.. మరో రిపోర్టర్ మృతి
దిశ, పాలేరు: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య భయంకంరంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ముఖ్యంగా మహమ్మారి ప్రస్తుతం జర్నలిస్టులపై పంజా విసురుతోంది. రోజుకో జర్నలిస్టులను పొట్టనపెట్టుకుంటూ విజృంభిస్తోంది. తాజాగా.. మరో జర్నలిస్టును మహమ్మారి బలిగొంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా రూరల్ మండలం తల్లంపాడు గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చింతమళ్ల శోభన్ బాబు(43)అనే వ్యక్తి ప్రజావాణి పత్రికలో పనిచేస్తున్నారు. ఇటీవల కరోనా పాజిటివ్ రాగా, ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి, గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అనేక సేవా కార్యక్రమాలల్లో పాల్గొన్న శోభన్ మృతి, స్థానిక మీడియా మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శోభన్ మృతికి ఎమ్మెల్యే సంతాపం
విలేఖరి శోభన్ మృతి పట్ల పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. విలేకరులు తగు జాగ్రత్తలు తీసుకుంటూ వృత్తి ధర్మం పాటించాలని సూచించారు. అవసరమైతే ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి ఆ కుటుంబానికి అన్ని విధాల సహాయ పడతానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.