ఆ విషయంలో జిల్లాను జాతీయ స్థాయిలో ముందుంచాలి: జాయింట్ కలెక్టర్ అరుణశ్రీ

by Sridhar Babu |
collector2
X

దిశ, జగిత్యాల కలెక్టరేట్: జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాల అమలుపై స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2021 యాప్ ద్వారా ప్రజలు స్వచ్ఛందంగా ఓటింగ్ లో పాల్గొని జగిత్యాల జిల్లాను ముందంజలో ఉంచాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె. అరుణశ్రీ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా ఆదనపు ప్రాజెక్టు డైరెక్టర్స్, ఎపియంలతో జేసీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణశ్రీ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రజలకు ఉన్న అవగాహన, పరిస్థితుల గూర్చి ప్రజలకు, మహిళలకు మండల స్థాయిలో ఎపియం, ఏపీఓలు అవగాహన కల్పించాలన్నారు. తద్వారా సీసీఎస్ లు వీఓఏలు గ్రామాల్లో పర్యటించి స్మార్ట్ ఫోన్ లో ఓటింగ్ వేయించాలని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లాను జాతీయ స్థాయిలో ముందుంచాలని అన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఓ వినోద్, సెర్ప్ ఏపీడీ సుధీర్, ఈజీఎస్ ఏపీడీలు శివాజీ, నరేశ్, అన్ని మండలాల ఎపియంలు పాల్గొన్నారు.

Advertisement

Next Story