- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీఆర్ఎస్‌లోకి చేరికలు
దిశ, కమలాపూర్: దళితులు ఆర్థికంగా ఎదగాలని, ఈ సమాజంలో అందరితో పాటు గౌరవం పొందాలనే తెలంగాణ ప్రభుత్వం దళిత బంధు పథకంను ప్రవేశపెట్టనున్నట్లు వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. అనంతరం మండలంలోని శ్రీ రాముల పల్లె గ్రామంలో 39 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మండలంలోని వివిధ కుల సంఘాలతో సమావేశమైన సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ఎన్నో వచ్చినా.. ప్రజలకు ఏమీ చేయలేదని, కేవలం ఓట్లు వేసే మిషన్లుగా చూశారని ఆరోపించారు.
గత పాలకులు దళిత వర్ణాలకు ఏమీ చేయలేదని, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలందరూ గురించి ఆలోచిస్తున్నారని, దళితులు అన్ని వర్గాలతో సమానంగా, ఆర్థికంగా, గౌరవంగా ఉండాలనే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని పథకాలను కేసీఆర్ ప్రవేశపెడుతున్నారని అన్నారు. అనంతరం పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఎమ్మెల్యేల సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.