కరోనా నివారణ కోసం లాక్‌డౌన్ పాటించాలి

by vinod kumar |
కరోనా నివారణ కోసం లాక్‌డౌన్ పాటించాలి
X

దిశ, మహబూబ్ నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా వ్యాధిని అరికట్టడానికి లాక్ డౌన్ పకడ్బందీగా అమలు చేయడం తప్ప మరో మార్గం లేదని కలెక్టర్ శృతి ఒఝా అన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కంటైన్మెంట్ జోన్లను 100 శాతం లాక్ డౌన్ చేసేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాధి మరింత ప్రబలకుండా ఉండాలంటే గద్వాల పట్టణంలో గుర్తించిన రెండు కంటైన్మెంట్ క్లస్టర్లు పాత హౌసింగ్ బోర్డు, మొమిన్‌మోహల్లా, వడ్డెపల్లి, ఐజలో మూడేసి వార్డులను కంటైన్మెంట్ ఏరియాగా గుర్తించామన్నారు. ఈ ప్రాంతంలోని ప్రజలు ఏ ఒక్కరు బయటికి రావడానికి గాని, బయటి నుంచి కొత్త వ్యక్తులు లోపలికి వెళ్లడానికి వీల్లేదన్నారు. దీన్ని 100 శాతం పకడ్బందీగా అమలు చేయడానికి మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లు, వార్డు మెంబర్లు, వలంటీర్లను నియమించామని, వారి ద్వారానే కంటైన్మెంట్ కుటుంబాలకు పాలు, పండ్లు, కూరగాయలు, మెడిసిన్, గ్యాస్ వంటి నిత్యావసర వస్తువులను సామాజిక దూరం పాటిస్తూ ఇంటింటికి సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత కంటైన్మెంట్ ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. హెల్త్ డిపార్టుమెంటు ద్వారా ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రతిరోజు 50 ఇళ్ల చొప్పున తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితులపై సమాచారం సేకరించి సంబంధిత మెడికల్ ఆఫీసర్‌కు అందజేస్తామన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జడ్పీ సీఈఓ ముషాయిదాబేగం, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి శశికళ, ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.

Tags: corona outbreak, jogulamba gadwal district, two red zones, collector meeting

Advertisement

Next Story

Most Viewed