అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్

by Anukaran |
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్కంఠంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఎట్టకేలకు డెమెక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారు. దీంతో అమెరికాకు 46వ అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నికయ్యారు. చివరగా జరిగిన ఐదు రాష్ట్రాల్లో నాలుగు చోట్ల బైడెన్ ఆధిక్యంలో నిలిచి అధ్యక్ష పీఠం కైవసం చేసుకున్నారు. జో బైడెన్‌ 284 ఎలక్టోరల్ ఓట్లు సాధించగా, డొనాల్డ్ ట్రంప్ 214 వద్దే ఆగిపోయాడు. దీంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలుపు లాంఛనమైంది.

Advertisement

Next Story