హిల్లరీ లెక్కను సరిచేసిన బైడెన్..

by Anukaran |   ( Updated:2020-11-13 20:41:42.0  )
హిల్లరీ లెక్కను సరిచేసిన బైడెన్..
X

దిశ, వెబ్‌డెస్క్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో సాగిన ఉత్కంఠ అంతా ఇంతా కాదు. తీరా మ్యాజిక్ ఫిగర్‌ను డెమొక్రటిక్ పార్టీ కైవసం చేసుకోవడంతో అగ్రరాజ్యానికి కాబోయే తరువాయి అధ్యక్షుడు ఎవరనేది తేలిపోయింది.అయితే, వైట్ హోస్‌ను వీడేది లేదని ట్రంప్ భీష్మించుకు కూర్చోవడంతో పాటు, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో అవినీతి జరిగిందని సుప్రీంకోర్టును ఆశ్రయించడం అంతా నాటకీయ పరిణామంగా చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా, డెమొక్రటిక్ అభ్యర్థికి స్పష్టమైన మెజార్టీ వచ్చినా ఆ సమయంలో ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కౌంటింగ్ మిగిలిపోయింది. తాజాగా కౌంటింగ్ ప్రక్రియ ముగియగా, ఎవరికెన్ని ఓట్లు పోలయ్యాయో న్యూయార్క్ టైమ్స్ ప్రచురించింది.

దాని ప్రకారం.. మొత్తం 538 ఎలక్టరోల్ ఓట్లలో జో బైడెన్‌కు 306 రాగా, ట్రంప్‌కు 232 వచ్చాయి. అరిజోనా, జార్జియా రాష్ట్రాల్లోనూ బైడెన్ జయకేతనం ఎగరేశారు.అయితే, బిల్ క్లింటన్ తర్వాత జార్జియా రాష్ట్రంలో విజయం సాధించిన డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ నిలిచారు.ఇదిలాఉండగా, 2016 అధ్యక్ష ఎన్నికల్లో అప్పటి డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌కు 238 ఓట్లు రాగా, రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌కు 306 ఓట్లు వచ్చాయి. 2020లో ఎన్నికల్లో జోబైడెన్ కు 306 రాగా, ట్రంప్‌కు 238 వచ్చాయి. మొత్తంగా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ను ఓడించడమే కాకుండా హిల్లరీ లెక్కను బైడెన్ సరిచేశారని అమెరికా వ్యాప్తంగా టాక్ వినిపిస్తోంది.

Advertisement

Next Story