ఓటమిని అంగీకరించిన ట్రంప్.. అధ్యక్షుడిగా బైడెన్

by Anukaran |
ఓటమిని అంగీకరించిన ట్రంప్.. అధ్యక్షుడిగా బైడెన్
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడిపై నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. అమెరికా 46వ అధ్యక్షుడిగా డెమొక్రాటిక్ నేత జో బైడెన్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా జో బైడెన్‌ విజయాన్ని యూఎస్ ఎలక్ట్రోరల్ కాలేజ్ ధృవీకరించింది. ఉపాధ్యక్షురాలిగా కమలాహారిస్ ఖరారు అయ్యారు. ఇక ఎట్టకేలకు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించారు. అధికార మార్పిడికి సహకరిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు.

జో బైడెన్ విజయాన్ని ధృవీకరించేందుకు యూఎస్ కాంగ్రెస్ సమావేశం సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. బైడెన్ ఎన్నికను వ్యతిరేకిస్తూ ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంలోకి దూసుకొచ్చారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో నలుగురు మృతి చెందారు.

Advertisement

Next Story

Most Viewed