సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ హైకోర్టు పిలుపు..

by Anukaran |   ( Updated:2021-01-17 01:14:21.0  )
సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ హైకోర్టు పిలుపు..
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ హైకోర్టు నుంచి పిలుపు వచ్చింది. గతంలో రాజస్థాన్‌లో ఓ సినిమా షూటింగ్ సమయంలో కృష్ణ జింకలను సల్మాన్ ఖాన్ వేటాడిన కేసులో ఫిబ్రవరి 6వ తేదీన మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.

ఈ కేసులో 2018లోనే సల్మాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కేసు తదుపరి విచారణ నిమిత్తం కోర్టు ఎదుట హాజరు కావాలని నోటీసులు జారీ అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed