- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
UPSC CSE 2023 ఫేజ్ 3 ఇంటర్వ్యూ షెడ్యూల్ విడుదల..
దిశ, ఫీచర్స్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 మూడవ దశ ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను విడుదల చేసింది. UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inలో ఇంటర్వ్యూ షెడ్యూల్ ను పొందుపరిచింది. ఇంటర్వ్యూ మార్చి 18 నుండి ప్రారంభమై ఏప్రిల్, 9, 2024 వరకు కొనసాగుతుంది. ఇంటర్వ్యూను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. విడుదల చేసిన షెడ్యూల్‌లో రోల్ నంబర్, తేదీ, ఇంటర్వ్యూ సమయం తెలిపారు.
మూడో దశలో మొత్తం 817 మంది అభ్యర్థులను కమిషన్ ఇంటర్వ్యూకు పిలిచింది. మొదటి షిఫ్ట్ ఇంటర్వ్యూకు రిపోర్టింగ్ సమయం ఉదయం 9 గంటలు కాగా రెండవ షిఫ్ట్‌కు అభ్యర్థి మధ్యాహ్నం 1 గంటలకు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్వ్యూకు పిలిచిన అభ్యర్థుల అడ్మిట్ కార్డులను త్వరలో జారీ చేయనున్నారు. ఇంటర్వ్యూ తేదీ, సమయంలో ఎలాంటి మార్పులు చేయబోమని కమిషన్ స్పష్టం చేసింది.
ఈ అభ్యర్థులు ఇంటర్వ్యూ ఇవ్వలేరు..
ప్రధాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత నిర్ణీత తేదీ, సమయంలో DAF-II ఫారమ్‌ను సమర్పించని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయనున్నారు. ఆ అభ్యర్థికి ఇంటర్వ్యూకు హాజరు కావడానికి హాల్ టిక్కెట్టు జారీ చేయలేమని స్పష్టం చేశారు. మరింత సమాచారం కోసం మీరు విడుదల చేసిన షెడ్యూల్‌ని తనిఖీ చేయాలని తెలిపారు.
UPSC CSE 2023 ఇంటర్వ్యూ షెడ్యూల్‌ను ఎలా చెక్ చేయాలి..
UPSC అధికారిక వెబ్‌సైట్ upsc.gov.inకి లాగిన్ అవ్వండి.
హోమ్ పేజీలో ఇచ్చిన UPSC సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2023 ఇంటర్వ్యూ షెడ్యూల్ లింక్ పై క్లిక్ చేయాలి.
కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫేజ్ 3 ఇంటర్వ్యూ షెడ్యూల్ పై క్లిక్ చేయండి.
మీ స్క్రీన్‌పై PDF కనిపిస్తుంది.
ఇప్పుడు ప్రోగ్రామ్‌ను చెక్ చేసి ప్రింట్ అవుట్ తీసుకోండి.