SSC CGL 2021 తుది ఫలితాలు విడుదల

by Harish |
SSC CGL 2021 తుది ఫలితాలు విడుదల
X

దిశ, కెరీర్: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి నిర్వహించిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్ - 2021 చివరి ఫలితాలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్‌సీ) మార్చి 17న విడుదల చేసింది. మొత్తం 7686 ఏఏవో, జేఎస్‌ఓ, ఎస్ఐ ఖాళీల భర్తీకి పరీక్షలు నిర్వహించింది. టైర్ -3లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఎస్ఎస్‌సీ జనవరిలో నైపుణ్య పరీక్ష, సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించింది. కేటగిరిల వారీగా కటాఫ్ మార్కులను వెబ్‌సైట్ లో ఉంచింది. తుది ఫలితాలను అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.

Advertisement

Next Story