గుడ్‌న్యూస్.. 212 SI, ASI పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

by Harish |   ( Updated:2023-04-27 14:19:47.0  )
గుడ్‌న్యూస్.. 212 SI, ASI పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
X

దిశ, కెరీర్: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ గ్రూప్ ఏ, బి, సి (నాన్ మినిస్టీరియల్, నాన్ గెజిటెడ్, కంబాటైజ్డ్ సిగ్నల్ స్టాఫ్) కేటగిరీలో ఎస్సై, ఏఎస్సై ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం పోస్టులు: 212

పోస్టుల వివరాలు:

సబ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌వో) - 19

సబ్ ఇన్‌స్పెక్టర్ (టెక్నికల్) - 5

సబ్ ఇన్‌స్పెక్టర్ (సివిల్, మేల్)- 20

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (టెక్నికల్) - 146

అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (డ్రాఫ్ట్స్ మ్యాన్) - 15

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా ఉత్తీర్ణత తో పాటు నిర్దిష్ట శారీరక, వైద్య ప్రమాణాలు కలిగి ఉండాలి.

వయసు: మే 21, 2023 నాటికి ఎస్సై పోస్టులకు 30 ఏళ్ల లోపు ఉండాలి.

ఏఎస్సై ఉద్యోగాలకు 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: ఎస్సై ఉద్యోగాలకు నెలకు రూ. 35,400 నుంచి రూ. 1,12,400 ఉంటుంది.

ఏఎస్సై ఉద్యోగాలకు నెలకు రూ. 29,200 నుంచి రూ. 92,300 ఉంటుంది.

అప్లికేషన్ ఫీజు: ఎస్సై పోస్టులకు రూ. 200

ఏఎస్సై పోస్టులకు రూ. 100 చెల్లించాలి.

ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికులు, మహిళా అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.

ఎంపిక: రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్/ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, వరంగల్.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మే 21, 2023.

ఎగ్జామ్ డేట్స్: జూన్ 24, 2023 నుంచి జూన్ 26, 2023 వరకు ఉంటుంది.

వెబ్‌సైట్: https://rect.crpf.gov.in


ఇవి కూడా చదవండి:

ఎయిమ్స్ పాట్నాలో 644 నాన్ టీచింగ్ ఖాళీలు

Advertisement

Next Story

Most Viewed