TS సెట్‌-2023 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

by GSrikanth |
TS సెట్‌-2023 నోటిఫికేష‌న్ విడుద‌ల‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటి టెస్ట్ (టీఎస్ సెట్)-2023 అర్హత ప‌రీక్ష నోటిఫికేష‌న్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుద‌ల చేసింది. రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెస‌ర్లు, డిగ్రీ కాలేజీల లెక్చర‌ర్లు అర్హత సాధించేందుకు ఈ ప‌రీక్షను నిర్వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. అర్హులైన అభ్యర్థులు ఆగ‌స్టు 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పేప‌ర్ 1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్ 2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులు కేటాయించ‌నున్నట్లు వెల్లడించింది. ప‌రీక్ష సమయం మూడు గంట‌లు ఉంటుందని, కంప్యూట‌ర్ బేస్డ్ టెస్టు ప‌ద్ధతిలో ప‌రీక్ష నిర్వహించ‌నున్నట్లు ప్రకటించింది. ఇతర స‌మాచారం కోసం www.telanganaset.org లేదా www.osmania.ac.in అనే వెబ్‌సైట్లను సంప్రదించాలని అభ్యర్థులకు సూచించింది.

Advertisement

Next Story