- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
RRB రైల్వే క్యాలెండర్ 2024 విడుదల.. గ్రూప్ 'D', NTPC రిక్రూట్‌మెంట్ ఎప్పుడంటే..
దిశ, ఫీచర్స్ : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు వివిధ రిక్రూట్‌మెంట్ పరీక్షల వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. పరీక్షల షెడ్యూల్ RRB rrbajmer.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. అసిస్టెంట్ లోకో పైలట్, టెక్నీషియన్, నాన్ టెక్నీషియన్, JE, ఇతర పోస్టుల కోసం RRB రిక్రూట్‌మెంట్ వార్షిక క్యాలెండర్ విడుదల చేసింది.
RRB విడుదల చేసిన వార్షిక క్యాలెండర్ ప్రకారం, అసిస్టెంట్ లోకో పైలట్ రిక్రూట్‌మెంట్ కోసం జనవరి నుండి మార్చి 2024 మధ్య నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. టెక్నీషియన్ల రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ఏప్రిల్ నుండి జూన్ వరకు నిర్వహించనున్నారు.
NTPC నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల అవుతుంది ?
నాన్-టెక్నికల్ NTPC గ్రాడ్యుయేట్ (స్థాయి 4, 5, 6), నాన్-టెక్నికల్ NTPC గ్రాడ్యుయేట్ (లెవల్ 2, 3), జూనియర్ ఇంజనీర్, పారామెడికల్ కేటగిరీల నియామక ప్రక్రియ జూలై నుండి సెప్టెంబర్ 2024 వరకు నిర్వహించనున్నారు. లెవెల్ 1 మినిస్టీరియల్, వివిధ కేటగిరీల రిక్రూట్‌మెంట్ కోసం అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
ALP రిక్రూట్‌మెంట్ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు ?
ALP పోస్ట్ CBT పరీక్ష జూన్, ఆగస్టు 2024 మధ్య జరగాల్సి ఉంది. రెండో దశ (CBT 2) పరీక్షను సెప్టెంబర్ 2024 లో నిర్వహించనున్నారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నవంబర్ 2024లో నిర్వహించేందుకు షెడ్యూల్ చేశారు. ఆప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం షార్ట్‌లిస్ట్ నవంబర్ 2024/డిసెంబర్ 2024లో విడుదల చేయనున్నారు.
9000 పోస్టుల కోసం RRB టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరి 2024 లో విడుదల చేయనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చిలో ప్రారంభమై ఏప్రిల్ 2024లో ముగుస్తుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు RRB అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు రైల్వే వయో పరిమితిని కూడా పొడిగించింది. విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 33 ఏళ్ల లోపు జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. అసిస్టెంట్ లోకో పైలట్ మొత్తం 5696 పోస్టుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 19 ఫిబ్రవరి 2024 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.