Railway Paramedical Recruitment 2024 : రైల్వేలో 1376 పోస్టులకు నోటిఫికేషన్..

by Sumithra |
Railway Paramedical Recruitment 2024 : రైల్వేలో 1376 పోస్టులకు నోటిఫికేషన్..
X

దిశ, ఫీచర్స్ : నిరుద్యోగులకు రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. రైల్వేలో 1300కు పైగా పోస్టులకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) పారామెడికల్ కేటగిరీలో వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

రైల్వేలో పారామెడికల్ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 17 నుండి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16 గా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా రైల్వేలో మొత్తం 1,376 పోస్టులను భర్తీ చేయనున్నారు.

1,376 పోస్టుల్లో నర్సింగ్ సూపరింటెండెంట్, డైటీషియన్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, డయాలసిస్ టెక్నీషియన్, ఫార్మసిస్ట్, లేబొరేటరీ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి. నర్సింగ్ సూపరింటెండెంట్ పోస్టులకు గరిష్ట రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. దీని కోసం మొత్తం 713 పోస్టులు రిజర్వ్ చేశారు. అలాగే ఫార్మసిస్ట్‌కు 246 పోస్టులు, హెల్త్ అండ్ మలేరియా ఇన్‌స్పెక్టర్ గ్రేడ్ III కోసం 126 పోస్టులు, ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II, రేడియోగ్రాఫర్ ఎక్స్ కోసం 94 పోస్టులు. రే టెక్నీషియన్ కోసం 64 పోస్టులు రిజర్వ్ చేశారు.

వయోపరిమితి.. విద్యార్హత..

డైటీషియన్ : అభ్యర్థి డైటెటిక్స్ (1 సంవత్సరం)లో B.Sc (సైన్స్) ఉండాలి. లేదా B.Sc హోమ్ సైన్స్ + M.Sc. పూర్తిచేసి ఉండాలి. వయోపరిమితి 18 నుంచి 33 ఏళ్లు.

ల్యాబ్ అసిస్టెంట్ గ్రేడ్ II : అభ్యర్థి సైన్స్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ) లేదా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ (DMLT)తో 12వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. ఈ పోస్టుకు వయోపరిమితిని కూడా 18 నుంచి 33 ఏళ్లుగా నిర్ణయించారు. ఇతర పోస్టుల వయోపరిమితి, విద్యార్హత గురించి తెలుసుకోవడానికి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ అధికారిక సైట్‌ను సందర్శించవచ్చు.

Advertisement

Next Story

Most Viewed