ఎంఎస్‌టీసీలో 62 ఆఫీసర్ పోస్టులు

by Harish |
ఎంఎస్‌టీసీలో 62 ఆఫీసర్ పోస్టులు
X

దిశ, కెరీర్: కోల్‌కతాలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎంఎస్‌టీసీ లిమిటెడ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టుల వివరాలు:

మొత్తం ఖాళీలు: 62

యంగ్ ప్రొఫెషనల్స్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డీ) పోస్టులు.

విభాగాలు: ఆపరేషన్స్ /మార్కెటింగ్/బిజినెస్ డెవలప్‌మెంట్/ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ /సిస్టమ్స్ /పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్.

పోస్టుల వివరాలు:

అర్హత:

1. ఓఎస్‌డీ (ఫ్రెషర్స్ ) -26 ఖాళీలు: సంబంధిత స్పెషలైజేషన్ లో కనీసం 60 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి.

వేతనం: నెలకు రూ. 46,000 చెల్లిస్తారు.

2. ఓఎస్‌డీ ( ఎక్స్ పీరియన్స్): సంబంధిత స్పెషలైజేషన్‌లో గ్రాడ్యుయేషన్ /ఎంబీఏ/డిప్లొమా/సీఏ/ఐసీడబ్ల్యూఏ/ఎంసీఏ ఉత్తీర్ణత ఉండాలి.

పని అనుభవం: కనీసం 2 - 5 ఏళ్ల పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు రూ. 50,000 నుంచి రూ 1.2 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: మార్చి 13, 2023.

వెబ్‌సైట్: https://www.mstcindia.co.in

Advertisement

Next Story