- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. ఈ నోటిఫికేషన్ మీ కోసమే..
దిశ, ఫీచర్స్ : ఢిల్లీ యూనివర్సిటీలో ఉద్యోగం చేయాలనుకుంటున్నారా.. అయితే ఈ నోటిఫికేషన్ మీ కోసమే. డీయూ నాన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు DU du.ac.in అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ 17 ఫిబ్రవరి 2024. అభ్యర్థులు జారీ చేసిన ప్రకటన మార్గదర్శకాల ప్రకారం నిర్ణీత తేదీలో లేదా అంతకు ముందు దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా డీయూ మొత్తం 36 నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 3, టెక్నికల్ అసిస్టెంట్ 6, లేబొరేటరీ అసిస్టెంట్ 12, ల్యాబొరేటరీ అటెండెంట్ 15 మొత్తం 15 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు చేసుకోవడానికి అర్హతలు..
సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం, అభ్యర్థి సంబంధిత సబ్జెక్టులో BE లేదా B.Tech డిగ్రీని కలిగి ఉండాలి. టెక్నికల్ అసిస్టెంట్‌కు సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల డిప్లొమా ఉండాలి. లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు కూడా మూడేళ్ల డిప్లొమా ఉండాలి. లాబొరేటరీ అటెండెంట్ పోస్టుకు సంబంధిత సబ్జెక్టులో ఐటీఐ డిగ్రీ ఉండాలి.
వయోపరిమితి..
లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తుదారుడి వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ఇతర పోస్టులకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు రుసుము..
దరఖాస్తు రుసుము జనరల్/అన్ రిజర్వ్డ్ కేటగిరీకి రూ. 1000,
OBC (NCL)/EWS మహిళా వర్గాలకు రూ. 800,
SC/ST PWBD కేటగిరీ అభ్యర్థులకు రూ. 600 గా నిర్ణయించారు. ఆన్‌లైన్ విధానంలో రుసుము చెల్లించాలి. మరిన్ని సంబంధిత వివరాల కోసం అభ్యర్థులు ఢిల్లీ యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష సమయం 2 గంటలు, మొత్తం 400 మార్కులు ఉంటాయి. అన్ని ప్రశ్నలు తప్పనిసరి ప్రతిప్రశ్నకు 4 మార్కులు కేటాయించబడ్డాయి. ప్రతి తప్పు సమాధానానికి 1 మార్కు కోత విధిస్తారు. నైపుణ్య పరీక్ష సమయం 1 గంట ఉంటుంది.