- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణ గురుకులాల్లో 2,008 జేఎల్, పీడీ, లైబ్రేరియన్ పోస్టుల పూర్తి వివరాలు ఇవే!
దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మజ్యోతిభాఫూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో డైరెక్ట్ ప్రాతిపదికన 2,008 జేఎల్, పీడీ, లైబ్రేరియన్ పోస్టుల భర్తీకి సంబంధించి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ - రిక్రూట్‌మెంట్ బోర్డు ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు:
జూనియర్ లెక్చరర్లు- 1,924
ఫిజికల్ డైరెక్టర్ - 34
లైబ్రేరియన్ - 50
సబ్జెక్టుల వారీగా జేఎల్ పోస్టులు:
తెలుగు - 225
హిందీ - 20
ఉర్దూ - 50
ఇంగ్లీష్ - 230
మ్యాథ్స్ - 324
ఫిజిక్స్ - 205
కెమిస్ట్రీ - 207
బోటనీ - 204
జువాలజీ - 199
హిస్టరీ - 7
ఎకనామిక్స్ - 82
కామర్స్ - 87
సివిక్స్ - 84
మొత్తం ఖాళీలు : 2008
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ, పీజీ, బీఈడీ, బీఏ బీఈడీ, బీఎస్సీ బీఈడీ, బీపీఈడీ, బీపీఈ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ లేదా తత్సమాన అర్హత ఉండాలి.
వయసు: జులై 1, 2023 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం: నెలకు రూ. 54, 220 నుంచి రూ. 1,33,630.
ఎంపిక: రాత పరీక్షలు(పేపర్ - 1, 2,3), డెమాన్ స్ట్రేషన్, సర్టిఫికెట్ల పరిశీలన, వైద్య పరీక్షలు .. ఆధారంగా ఎంపిక చేస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 1,200 (ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 600 చెల్లించాలి)
దరఖాస్తు: ఆన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
చివరి తేదీ: మే 17, 2023.
వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in