- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Job Notification : టెక్నీషియన్ పోస్టుల భర్తీకి జాబ్ మేళా
దిశ తెలంగాణ బ్యూరో: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయిమెంట్ బ్యూరో (Employment Bureau of Osmania University)ఆధ్వర్యంలో బొండాడ సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ (Bondada Services Private Limited)ఆధ్వర్యంలో ఈ నెల 19 న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా (Job fair)నిర్వహించనున్నట్టు అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాయిమెంట్ బ్యూరో కార్యాలయంలో ఈ జాబ్ మేళా(Job fair)ను నిర్వహిస్తున్నామన్నారు. కంపెనీలో 50 టెక్నిషియన్ పోస్టులను జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. ఐటీఐ, డిప్లొమా, బీ.టెక్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ చేసిన 18 నుండి 50 ఏళ్ల వయస్సు వారికి మాత్రమే ఈ జాబ్ మేళాలో అవకాశం కల్పిస్తున్నామన్నారు. మరిన్ని వివరాలకు హెచ్ఆర్ రాహుల్ ను 93987 22629 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలన్నారు. విద్యార్హతలకు, సంబంధిత ధ్రువ పత్రాలతో హాజరు కావాలని కోరారు.